logo

వైకాపాను గద్దె దించేందుకు జనం ఎదురుచూపు

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక ప్రాంతాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తానని అనకాపల్లి పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్‌ హామీ ఇచ్చారు.

Published : 08 May 2024 03:40 IST

నివాళులర్పిస్తున్న సీఎం రమేశ్‌, పక్కన అయ్యన్న

నర్సీపట్నం అర్బన్‌, కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక ప్రాంతాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తానని అనకాపల్లి పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్‌ హామీ ఇచ్చారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా మంగళవారం కృష్ణదేవిపేటలోని నందనవనంలో సమాధులను సందర్శించి నివాళులర్పించారు. రాత్రికి వేములపూడిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు అన్ని వర్గాల వారూ ఎదురుచూస్తున్నారని చెపారు. పాండవుల కట్ట వద్ద మినీ రిజర్వాయరు నిర్మించాలని కోరుతూ పాతమల్లంపేట సర్పంచి గెడ్డం ఆదిలక్ష్మి తదితరులు సీఎం రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు. విప్పలపాలెం ఆనకట్ట ఆధునికీకరణకు నోచుకోలేదని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆయా కార్యక్రమాల్లో నర్సీపట్నం అభ్యర్థి అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్యే ముత్యాలపాప, తెదేపా మండల అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, జడ్పీటీసీ సభ్యుడు వేణుగోపాల్‌, జెమీలు, సాంబమూర్తి, సత్యనారాయణ, ప్రసాద్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వేములపూడి సభకు హాజరైన కార్యకర్తలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు