logo

ఎప్పటికప్పుడే రైతులకు నగదు జమ

జిల్లాలోని భీమసింగి సహకార, లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారాల పరిధి నుంచి శ్రీకాకుళం జిల్లా సంకిలి షుగర్స్‌కు చెరకు తరలింపు సాఫీగా సాగుతోందని ఆ కర్మాగారం ఏజీఎం (కేన్‌) ఎం.రమేష్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం భీమసింగి షుగర్స్‌ వద్ద ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ

Published : 22 Jan 2022 05:45 IST

భీమసింగి చక్కెర కర్మాగారం వద్ద లోడ్లు

జామి, న్యూస్‌టుడే: జిల్లాలోని భీమసింగి సహకార, లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారాల పరిధి నుంచి శ్రీకాకుళం జిల్లా సంకిలి షుగర్స్‌కు చెరకు తరలింపు సాఫీగా సాగుతోందని ఆ కర్మాగారం ఏజీఎం (కేన్‌) ఎం.రమేష్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం భీమసింగి షుగర్స్‌ వద్ద ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ఇంత వరకు కర్మాగారం పరిధి నుంచి 3500 టన్నుల చెరకు తరలించామని చెప్పారు. జనవరి 15 వరకు 2900 టన్నులు అందించిన రైతులకు రూ.88 లక్షలను జమ చేసినట్లు వివరించారు. ఇక్కడ 25 నుంచి 30 వేల టన్నుల మేర లభ్యమవుతుందని అంచనా వేశామన్నారు. శనివారం నుంచి రోజుకు 700 టన్నుల చెరకు తరలిస్తామన్నారు. ఇంతవరకు లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ షుగర్స్‌ నుంచి 30 వేల టన్నుల చెరకు సేకరించగా, 28 వేల టన్నులకు చెల్లింపులు చేసినట్లు చెప్పారు. అక్కడ 1.20 లక్షల టన్నుల చెరకు అందుబాటులో ఉన్నట్లు అంచనాలు వేశామన్నారు. రెండు చక్కెర కర్మాగారాల పరిధిలో మొత్తం చెరకును తీసుకుంటామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని