logo

మహిళలకు భరోసా..!

మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్‌, న్యూస్‌టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు.

Published : 19 Apr 2024 04:22 IST

కురవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యురాలు

మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్‌, న్యూస్‌టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించకపోవడంతో సకాలంలో చికిత్స అందక అనారోగ్యం పాలవుతున్నారు. ప్రధానంగా వివిధ రకాలైన క్యాన్సర్లపై అవగాహన లేక ఆ వ్యాధి ముదిరేంత వరకు కూడా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరికంతో కొందరు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం లేదు. ఇలాంటి వారికి ఉచితంగా మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం గతేడాది మార్చి 8న ‘ఆరోగ్య మహిళా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఎంపిక చేసిన వైద్య కేంద్రాల్లో..

మహిళలకు వచ్చే వివిధ రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి రోగ నిర్ధారణ తర్వాత వారికి అవసరమైన ఔషధాలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో జిల్లాలో ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కూడా ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆధునిక యంత్రాలతో వ్యాధుల నిర్ధారణ చేసి చికిత్స అందిస్తున్నారు. ప్రతి మంగళవారం, గురువారం ఆయా కేంద్రాల్లో మహిళలకు  సంబంధిత వైద్య నిపుణులు పరీక్షలు చేస్తారు. వివిధ రకాల క్యాన్సర్లు, థైరాయిడ్‌, రక్తహీనత, రక్తపోటు, సూక్ష్మ పోషక లోపాలు, ఇతర క్యాన్సర్‌లాంటి వ్యాధి నిర్దారణకు హైదరాబాద్‌, తదితర ప్రముఖ ప్రయోగశాలకు పంపించి రోగ నిర్ధారణ చేయడంతో పాటు రూ.వేలల్లో ఖర్చయ్యే మందులను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. ఈ మేరకు 13,427 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కొందరిలో ఒక వ్యాధి మాత్రమే నిర్ధారణ కాగా మరికొందరు నాలుగైదు రకాల వ్యాధులతో అనారోగ్యాలకు గురైనట్లు గుర్తించారు. స్థానికంగా చికిత్స అవసరమైనవారికీ ఇక్కడనే వైద్య సేవలు అందిస్తున్నారు. మరికొన్ని వ్యాధుల చికిత్స కోసం పెద్దాసుపత్రులకు రిఫర్‌ చేస్తున్నారు.


ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయొద్దు

- డాక్టర్‌ బి.కళావతిబాయి, జిల్లా వైద్యశాఖాధికారి.

ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. మహిళలు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికి సకాలంలో చికిత్సలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. పౌష్ఠికాహారం తీసుకోవాలి. వైద్యుల సూచనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని