logo

రెండోరోజు మూడు నామపత్రాలు

వరంగల్‌ లోక్‌సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్‌ పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ పి.ప్రావీణ్య తెలిపారు.

Published : 20 Apr 2024 01:44 IST

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ లోక్‌సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్‌ పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ పి.ప్రావీణ్య తెలిపారు. మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ అభ్యర్థితో పాటు స్వతంత్రంగా ఏఆర్‌ నేనా ప్రేమ్‌రెడ్డి రిపిక రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థిగా పెరంబుదూరి కృష్ణసాగర్‌ ఒక సెట్‌, బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అభ్యర్థిగా పంజా కల్పన ఒక సెట్‌ నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్యకు అందజేశారు. శుక్రవారం వరకు మొత్తం ఆరుగురు అభ్యర్థులు 7సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. వరంగల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి తదితర అధికారులు పాల్గొన్నారు.

పెద్దపల్లిలో ముగ్గురు..

పెద్దపల్లి కలెక్టరేట్‌ : పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి రెండో రోజు శుక్రవారం ముగ్గురు నామినేషన్లు వేశారు. భారాస తరపున కొప్పుల ఈశ్వర్‌, కాంగ్రెస్‌ తరపున గడ్డం వంశీకృష్ణ తమ నామపత్రాలు రిటర్నింగ్‌ అధికారి ముజమ్మిల్‌ ఖాన్‌కు అందజేశారు. భారాస అభ్యర్థిగా కొంకటి లింగమూర్తి అనే వ్యక్తి కూడా నామినేషన్‌ వేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని