logo

అయిదుశాతం రాయితీకి చివరి అవకాశం

ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపులకు వరంగల్‌ నగర ప్రజల నుంచి స్పందన లభించింది. సోమవారం సాయంత్రం వరకు సుమారు రూ.18 కోట్ల పైన వసూలైనట్లు బల్దియా పన్నుల విభాగం అధికారులు తెలిపారు.

Published : 30 Apr 2024 03:09 IST

అజారా ఆసుపత్రి యాజమాన్యం నుంచి చెక్కు తీసుకుంటున్న బల్దియా అధికారులు
కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపులకు వరంగల్‌ నగర ప్రజల నుంచి స్పందన లభించింది. సోమవారం సాయంత్రం వరకు సుమారు రూ.18 కోట్ల పైన వసూలైనట్లు బల్దియా పన్నుల విభాగం అధికారులు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లిస్తే అయిదుశాతం రాయితీ ఉంటుంది. మంగళవారం సాయంత్రంలోపు గడువు ముగియనుందని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే పిలుపునిచ్చారు. సోమవారం వరంగల్‌ ములుగురోడ్డు అజారా ఆసుపత్రి యాజమాన్యం రూ.16,22,142, భీమారానికి చెందిన ఎస్వీఎస్‌ కళాశాల రూ.14,11,522  ఆస్తిపన్ను చెల్లించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను కాజీపేట సర్కిల్‌ ఉప కమిషనర్‌ రవీందర్‌, ఆర్వో యూసుఫొద్దీన్‌, ఆర్‌ఐ సురేష్‌ తీసుకున్నారు. ముందస్తు ఆస్తిపన్ను రూ.25 కోట్లు వసూలు చేయాలని కమిషనర్‌ లక్ష్యం ఖరారు చేయగా.. సోమవారం రాత్రి వరకు రూ.18 కోట్లు దాటింది. మంగళవారం చివరి రోజూ రూ.3-4 కోట్లు వసూలవుతుందని అధికారుల అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని