logo

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సన్నాహాలు

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు జనగామ జిల్లా ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేయగా గెలుపొందారు.

Published : 17 May 2024 03:49 IST

జిల్లాలో 23,419 మంది ఓటర్లు

ఎమ్మెల్సీ ఎన్నికపై బుధవారం జరిగిన దృశ్యమాధ్యమ సమీక్షలో జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా, ఇతర అధికారులు

జనగామ, న్యూస్‌టుడే: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు జనగామ జిల్లా ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేయగా గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నెల(మే) 27న జరిగే పోలింగ్‌కు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులు, వారి తరఫున స్థానిక నాయకులు ప్రచారాన్ని ప్రారంభించారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు పూర్తయింది. ఓటు కోసం 23698 దరఖాస్తులు రాగా. 1828 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. ముసాయిదా జాబితాను అనుసరించి ఓటర్ల సంఖ్య 21870. ఫిర్యాదులు, అభ్యంతరాల పరిష్కారం అనంతరం ఏప్రిల్‌ 4న తుది వివరాలను ప్రకటించారు. జనగామ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 17 కేంద్రాల్లో 14886 మంది ఓటర్లున్నారు. నర్మెట్ట, తరిగొప్పులలో ఒక్కో కేంద్రం, బచ్చన్నపేటలో రెండు, జనగామ పట్టణంలో ఆరు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ డివిజన్లో 10 కేంద్రాల పరిధిలో 8533 మంది ఓటర్లున్నారు. లింగాలఘనపురం, రఘునాథపల్లి, జఫర్‌గఢ్‌ దేవరుప్పులలో రెండేసి, స్టే.ఘన్‌పూర్‌, పాలకుర్తిలో మూడు పీఎస్‌ల చొప్పున, చిల్పూరు, కొడకండ్లలో ఒక్కో కేంద్రం ఏర్పాటైంది.

జిల్లాలో ఓటర్ల వివరాలు

పురుషులు- 14915,
మహిళలు-8503,
ఇతరులు-01
మొత్తం-23419.
పోలింగ్‌ కేంద్రాలు-27

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని