logo

ఓరుగల్లు.. జలమయం!

భారీ వర్షంతో వరంగల్‌ నగరం తడిసి ముద్దయింది. గురువారం సాయంత్రం నుంచి అనేక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో రహదారులపై వరద పోటెత్తింది.

Published : 17 May 2024 03:53 IST

హనుమకొండ బస్టాండులో  పోటెత్తిన వరద

ఈనాడు, వరంగల్‌, ఎంజీఎం ఆసుపత్రి, కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: భారీ వర్షంతో వరంగల్‌ నగరం తడిసి ముద్దయింది. గురువారం సాయంత్రం నుంచి అనేక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో రహదారులపై వరద పోటెత్తింది. హనుమకొండ బస్టాండు సమీపంలో మోకాలి లోతు నీరు నిలవడంతో రాకపోకలకు వాహదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. జనగామ బస్టాండు ప్రాంగణంలోని ప్రధాన కూడలి  భారీ వర్షానికి జలమయమైంది. పరకాల పట్టణంలో రోడ్లపైకి వరద పోటెత్తింది. ఈ అకాల వర్షం రైతులను తీవ్రంగా నష్టపరిచింది. అనేక చోట్ల ఈదురుగాలుల వల్ల మామిడి కాయలు రాలిపోయాయి. హసన్‌పర్తి, దామెర, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, వేలేరు, ఐనవోలు, ధర్మసాగర్‌, కాజీపేట, ఆత్మకూరు, పరకాల, శాయంపేట మండలాల్లో వర్షం కురిసింది. వరంగల్‌ జిల్లాలోని గీసుకొండ, ఖిలావరంగల్‌, నల్లబెల్లి, దుగ్గొండి, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, తదితర మండలాల్లోనూ అదే పరిస్థితి. అకాల వర్షాల కారణంగా కల్లాలు, రోడ్లపై పోసిన ధాన్యం తడిసి పోయాయి. మామిడి కాయలు రాలాయి. నీట తడిసిన కాయలు అక్కరకు రాకుండా పోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

భారీ వర్షానికి కరీమాబాద్‌లోని పోచమ్మగుడి ముందు విద్యుత్తు తీగలపై పడిన వృక్షం

గ్రేటర్‌లో ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్‌ రూం

భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో గ్రేటర్‌ వరంగల్‌ అప్రమత్తమైంది. నగర ప్రజలకు సత్వర సహాయం అందించేందుకు బల్దియా ప్రధాన కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లుగా కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. 24 గంటల పాటు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు. టోల్‌ ఫ్రీ నెంబరు 1800 425 1980, ఫోన్‌ నెంబరు 9701999645, వాట్సాప్‌ 9701999676 లో సంప్రదించాలని కమిషనర్‌ కోరారు. ఇంజినీరింగ్‌, ప్రజారోగ్యం, డీఆర్‌ఎఫ్‌ టీం 24 గంటల పాటు సేవలందించేందుకు సిద్ధంగా ఉంటారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని