logo

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు, లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్‌ హెచ్చరించారు.

Updated : 18 May 2024 04:08 IST

ఎస్పీ శబరీష్‌ 

ములుగు టౌన్, న్యూస్‌టుడే: నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు, లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్‌ హెచ్చరించారు. ములుగు జిల్లా పరిధిలో ప్రతి రోజు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు, వాహన తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఇసుక లారీలు రోడ్డుకు ఇరువైపులా అనుమతి లేకుండా నిలిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధిక లోడుతో వెళ్లినా.. రోడ్డు నియమాలు పాటించకుండా, అతి వేగంతో వాహనాలు నడిపితే ఉపేక్షించమన్నారు. వాహనాలపై కేసులు నమోదు చేసి సీˆజ్‌ చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో మోటార్‌ వాహన చట్టం ప్రకారం 182 కేసులు నమోదు చేసి రూ.1.65 లక్షలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు