logo

కులాల మధ్య చిచ్చుపెట్టారు : ఉపముఖ్యమంత్రి

రాజకీయ లబ్ధి కోసం తెదేపా, జనసేన నాయకులు కులాల మధ్య చిచ్చు రాజేసి తూర్పుగోదావరి జిల్లాలో అల్లర్లకు కారణమయ్యారని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం తాడేపల్లిగూడెం 27వ వార్డులో నిర్వహించిన గడప గడపకు

Published : 26 May 2022 03:50 IST

ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి కొట్టు

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: రాజకీయ లబ్ధి కోసం తెదేపా, జనసేన నాయకులు కులాల మధ్య చిచ్చు రాజేసి తూర్పుగోదావరి జిల్లాలో అల్లర్లకు కారణమయ్యారని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం తాడేపల్లిగూడెం 27వ వార్డులో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ తన సామాజిక వర్గానికి చెందిన యువతను పాడు చేస్తున్నారని ఆరోపించారు.

అన్నదమ్ముల్లా ఉండాలి: మోసేనురాజు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: అన్ని వర్గాలు అన్నదమ్ముల్లా వ్యవహరించి కోనసీమ జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని శానసమండలి ఛైర్మన్‌ కొయ్యే మోసేనురాజు సూచించారు. భీమవరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకే సీఎం జగన్‌ జిల్లాల విభజన చేసి, పలు జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టారన్నారు. కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని దళితవర్గాలు, పలు రాజకీయ పక్షాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని, దీనికి తెదేపా, జనసేన, భాజపా నాయకులు కూడా మద్దతు ఇచ్చారన్నారు. దీంతో ‘అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా’ పేరు మార్పునకు నోటిఫికేషన్‌ జారీ చేశారన్నారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరించేందుకు ఇంకా గడువు ఉందని, అంబేడ్కర్‌వాదులు సహనంగా ఉండాలని కోరారు. మంత్రి, ఎమ్మెల్యే నివాసాలపై దాడులు చేయడం దురదృష్టకరమని, వాటిని ఖండిస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని