Zelenskyy: రష్యా వాంటెడ్‌ లిస్ట్‌లో జెలెన్‌స్కీ..!

ఉక్రెయిన్‌ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీపై రష్యా క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన్ను తన వాంటెడ్‌ లిస్ట్‌లో చేర్చినట్లు కథనాలు వెలువడ్డాయి. 

Published : 04 May 2024 23:12 IST

మాస్కో: ఉక్రెయిన్‌ (Ukraine)పై భీకర దాడులు కొనసాగిస్తోన్న రష్యా (Russia).. తాజాగా ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy)పై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన్ను తన వాంటెడ్‌ లిస్ట్‌లో చేర్చినట్లు స్థానిక వార్తాసంస్థ ‘టాస్‌’ను ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి. అంతర్గత వ్యవహారాలశాఖ డేటాబేస్‌ ఆధారంగా ఈ సమాచారం వెల్లడించినట్లు తెలిపాయి. అయితే.. జెలెన్‌స్కీని ఆ జాబితాలో చేర్చడం వెనుక కారణాలు వెల్లడి కావాల్సి ఉంది.

దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్‌ దౌత్యవేత్త..!

2022 ఫిబ్రవరిలో దండయాత్ర మొదలు అనేకమంది ఉక్రెయిన్‌, ఐరోపా దేశాల నేతలపై రష్యా అరెస్టు వారెంట్లు జారీ చేసింది. సోవియట్ కాలం నాటి స్మారక చిహ్నాలను ధ్వంసం చేసినందుకుగానూ ఫిబ్రవరిలో రష్యన్ పోలీసులు ఎస్తోనియా ప్రధాన మంత్రి కాజా కల్లాస్, లిథువేనియా సాంస్కృతికశాఖ మంత్రి, లాత్వియా ఎంపీలను వాంటెడ్ జాబితాలో చేర్చారు. యుద్ధ నేరాల ఆరోపణలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై గత ఏడాది వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) ప్రాసిక్యూటర్‌పైనా మాస్కో అరెస్టు వారెంట్ జారీ చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని