Dmart results: డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు

Dmart Q4 results: దేశవ్యాప్తంగా డీమార్ట్‌ పేరిట సూపర్‌ మార్కెట్లు నిర్వహించే అతిపెద్ద రిటైల్‌ చైన్‌ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

Updated : 04 May 2024 21:53 IST

Dmart Q4 results | దిల్లీ: దేశవ్యాప్తంగా డీమార్ట్‌ (Dmart) పేరిట సూపర్‌ మార్కెట్లు నిర్వహించే అతిపెద్ద రిటైల్ చైన్‌ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ త్రైమాసిక ఫలితాలను శనివారం ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.460 కోట్లతో పోలిస్తే లాభం 22.39 శాతం పెరిగింది. ఆదాయం రూ.10,594 కోట్ల నుంచి రూ.12,727 కోట్లకు చేరిందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. దుస్తులు, సాధారణ వస్తువుల కొనుగోళ్లు పెరగడంతో లాభం నమోదైనట్లు కంపెనీ సీఈఓ, ఎండీ నోరోన్హా తెలిపారు.

నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్‌ కాల్స్‌పై జిరోదా సీఈవో పోస్ట్‌

మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం రూ.2,378  కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయానికి ఆ లాభం రూ.2,536 కోట్లుగా ఉంది. అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కార్యకలాపాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం రూ.42,840 కోట్ల నుంచి రూ.50,789 కోట్లకు చేరినట్లు తెలిపింది. ఈ ఏడాదిలో కొత్తగా 41 స్టోర్లు తెరిచినట్లు తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం స్టోర్ల సంఖ్య 365కి చేరినట్లు పేర్కొంది. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌, దమన్‌, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, దిల్లీ ఎన్‌సీఆర్‌, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో డీమార్ట్‌ స్టోర్లు ఉన్నాయి. తాజాగా గురుగ్రామ్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. మొత్తం 23 నగరాల్లో తన స్టోర్లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని