బండిముత్యాలమ్మ సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో బండిముత్యాలమ్మను శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటరామన్ రామసుబ్రహ్మణ్యన్, సరస్వతి దంపతులు దర్శించుకున్నారు.
అమ్మవారి సన్నిధిలో జస్టిస్ వెంకటరామన్ రామసుబ్రహ్మణ్యన్ దంపతులు
మొగల్తూరు, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో బండిముత్యాలమ్మను శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటరామన్ రామసుబ్రహ్మణ్యన్, సరస్వతి దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జస్టిస్ వెంకటరామన్ రామసుబ్రహ్మణ్యన్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో డి.రామకృష్ణంరాజు, ఛైర్మన్ కొల్లాటి రామారావు, పాలకవర్గ సభ్యులు తదితరులు వారికి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపిక అందించారు. ఆయన వెంట ప్రముఖ న్యాయవాదులు దాసరి ప్రసాద్, సీహెచ్ వెంకటరామన్, గుడిసేవ నరసింహమూర్తి, స్వర్ణం ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
ChandraBabu: అక్రమాలను ఆడ్డుకోండి: సీఎం జగన్కు చంద్రబాబు లేఖ
-
Sports News
Team India Slip Cordon: టీమ్ ఇండియా స్లిప్ కార్డన్లో ఎవరు బెస్ట్.. ChatGPT ఏం చెప్పింది?
-
India News
Uttarakhand: సెలవులో ఉన్న టీచర్లకు రిటైర్మెంట్..! ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం
-
World News
Trump: ప్రైవేట్ పార్టీలో దేశ రహస్యాలను లీక్ చేసిన ట్రంప్!
-
Politics News
Nellore: హీటెక్కిన రాజకీయాలు.. ఆనంతో నెల్లూరు తెదేపా నేతల భేటీ
-
Movies News
Agent ott: ఆ మార్పులతో ఓటీటీలో అఖిల్ ‘ఏజెంట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?