logo

సమర్థంగా విధులు నిర్వహించండి

సమర్థంగా విధులు నిర్వహించి సారా రవాణా, తయారీ, గంజాయి, ఖైనీ, గుట్కా అమ్మకాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఆదేశించారు.

Published : 08 Jun 2023 05:44 IST

ప్రశంసాపత్రాలు అందజేస్తున్న ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: సమర్థంగా విధులు నిర్వహించి సారా రవాణా, తయారీ, గంజాయి, ఖైనీ, గుట్కా అమ్మకాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఆదేశించారు. ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాలోని ఎస్‌ఈబీ అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. అంతర్‌రాష్ట్ర, జిల్లా చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలన్నారు. ఎక్కువ కేసులు నమోదైన నిందితులపై పీడీ యాక్టులు నమోదు చేయాలన్నారు. నేరాల అడ్డుకట్టకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 14500 టోల్‌ ఫ్రీ నంబర్‌పై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. అనంతరం ప్రతిభ సాధించిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎస్‌ఈబీ సూపరింటెండెంట్‌ అరుణకుమారి, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ అమర్‌బాబు, సీఐలు ధనరాజు, ప్రసాద్‌కుమార్‌, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని