logo

కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం

దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు.

Published : 26 Apr 2024 03:56 IST

విశ్రాంత ఉద్యోగులతో భీమవరం అభ్యర్థి రామాంజనేయులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. ఏపీ పింఛనర్స్‌ అసోసియేషన్‌ అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణ పెన్షనర్స్‌ సంక్షేమ సంఘం సభ్యులు రామాంజనేయులును ఎన్నికల శిబిరంలో గురువారం కలిసి మద్దతు తెలిపింది. సంఘ నాయకులు పి.గురవయ్య, జి.పూర్ణచంద్రరావు, మాజీ కార్యదర్శి చౌదరి తదితరులు మాట్లాడుతూ జగన్‌ పాలనలో పింఛనర్లకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో 3.80 లక్షల మంది పింఛనర్లు ఉండగా కరోనా సమయంలో ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమిని గెలిపించాలని రామాంజనేయులు కోరారు. పి.నాగరాజు, ఆచంట రామరాయుడు, డి.క్రిస్టోఫర్‌, ఆర్‌.రామ్మూర్తినాయుడు, వి.కృష్ణమనాయుడు, పి.పిచ్చయ్య, సీహెచ్‌ సుభాష్‌చంద్రబోస్‌, సీహెచ్‌ శ్రీనివాసరావు, టి.వెంకటనర్సయ్య, వై.దానయ్య, పి.పద్మనాభం, తెదేపా రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నాగిడిపాలెం, దెయ్యాలతిప్ప(భీమవరం గ్రామీణ), న్యూస్‌టుడే: కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు భీమవరం మండలం నాగిడిపాలెం, దెయ్యాలతిప్ప, కోమటితిప్ప తదితర గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం చేశారు. గతంలో తాను చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకొని మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని