logo

45 రోజులపాటు శెట్టిపేట, కాల్దరి రైల్వేగేట్ల మూత

నిడదవోలు - భీమవరం రైల్వే బ్రాంచి లైను డబ్లింగ్‌ పనుల నిమిత్తం నిడదవోలు మండలం శెట్టిపేట, ఉండ్రాజవరం మండలం కాల్దరి రైల్వేగేట్లు (163, 164)ను 45 రోజుల పాటు మూసివేయనున్నట్లు రైల్వే భద్రతా అధికారి వి.నాగేశ్వరరావు శనివారం

Published : 23 Jan 2022 03:53 IST

నిడదవోలు, న్యూస్‌టుడే: నిడదవోలు - భీమవరం రైల్వే బ్రాంచి లైను డబ్లింగ్‌ పనుల నిమిత్తం నిడదవోలు మండలం శెట్టిపేట, ఉండ్రాజవరం మండలం కాల్దరి రైల్వేగేట్లు (163, 164)ను 45 రోజుల పాటు మూసివేయనున్నట్లు రైల్వే భద్రతా అధికారి వి.నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మార్గం లో లెవెల్‌ క్రాసింగ్‌ గేట్ల వద్ద రైల్వే అండర్‌ వంతెన పనుల నిమిత్తం ఫిబ్రవరి 10 ఉదయం 8 గంటల నుంచి మార్చి 25వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంచనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో రైల్వే అండర్‌ బ్రిడ్జీలు, అప్రోచ్‌ రహదారి నిర్మాణ పనుల నిమిత్తం ప్రణాళికలు రూపొందించామన్నారు. రెవెన్యూ, పోలీస్‌ తదితర శాఖల అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై అవగాహన కల్పించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని