logo

ఆసుపత్రిలో చీకట్లు... రోగులకు ఇక్కట్లు

సర్వజన ఆసుపత్రిలోని ఓపీ విభాగంలోని రక్త పరీక్షల విభాగం వద్ద విద్యుత్తు దీపాలు వెలడం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 23 May 2024 03:31 IST

న్యూస్‌టుడే, రిమ్స్‌ : సర్వజన ఆసుపత్రిలోని ఓపీ విభాగంలోని రక్త పరీక్షల విభాగం వద్ద విద్యుత్తు దీపాలు వెలడం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం ఆరు నుంచి ఉదయం వరకు క్యాజువాల్టీ, ఐసీయూ, కాన్పుల విభాగాలకు వచ్చే రోగులకు రక్త పరీక్షలు చేయాలంటే ఓపీ విభాగంలో ఉండే  కేంద్రానికి వెళ్లాలి. ప్రమాదాల్లో గాయపడిన వారు, ప్రసవం కోసం వచ్చే వారు అర్థరాత్రి సమయంలో కూడా వస్తారు. ఆ సమయంలో కూడా రోగిని చేర్చి బంధువులు రక్త నమూనాలు తీసుకుని ల్యాబ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఆ ప్రాంతం మొత్తం చీకటిగా ఉండడంతో   వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి  విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. దీనిపై బాధ్యుడు నబీరసూల్‌ మాట్లాడుతూ దీపాలు బాగుచేయించి, రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని