logo

మహిళలే అధికం!

జిల్లాలో నూతనంగా విడుదల చేసిన ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. గత జనవరి 5న విడుదల చేసిన ముసాయిదా జాబితా కంటే తాజాగా ఓటర్లు పెరిగారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 14,24,629 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 6,99,309 మంది పురుషులు, 7,25,193 మంది మహిళలు,  127 మంది ఇతరులు ఉన్నారు.

Published : 29 Apr 2024 03:52 IST

జిల్లాలో మొత్తం ఓటర్లు  14,24,629

రాజంపేటలో ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు (పాతచిత్రం)

న్యూస్‌టుడే, రాయచోటి: జిల్లాలో నూతనంగా విడుదల చేసిన ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. గత జనవరి 5న విడుదల చేసిన ముసాయిదా జాబితా కంటే తాజాగా ఓటర్లు పెరిగారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 14,24,629 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 6,99,309 మంది పురుషులు, 7,25,193 మంది మహిళలు,  127 మంది ఇతరులు ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 25,,884 మంది అధికంగా ఉన్నారు. గత జనవరి 5న విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 13,58,734 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 6,71,698 మంది పురుషులు, 6,86,895 మంది మహిళలు ఉండగా, మిగిలినవారు ఇతరులున్నారు. పురుషుల కంటే మహిళలు 15,197 మంది అధికంగా ఉన్నారు. గత జాబితా కంటే తాజాగా విడుదలైన జాబితాలో 65,895 మంది ఓటర్లు అధికంగా ఉండడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని