logo

కలసపాడులో 144 సెక్షన్ అమ‌లు

కలసపాడు మండలంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల‌ మేర‌కు శనివారం నుంచి ఈనెల 14 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్ఐ.నాగ మురళి తెలిపారు.

Updated : 10 May 2024 17:06 IST

కలస‌పాడు: కలసపాడు మండలంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల‌ మేర‌కు శనివారం నుంచి ఈనెల 14 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్ఐ.నాగ మురళి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు దుకాణాలు, టీ బంకులు, పెట్రోల్ బంకులు, రచ్చబండలు, హోటళ్లు తదితర ప్రాంతాల్లో గుంపులుగా ఉంటే లాఠీఛార్జి చేయ‌డంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల నేపథ్యంలో నలుగురు అంతకు అంతకుమించి గుంపు ఉండకూడదని పేర్కోన్నారు.  మండలంలోని రాజుపాలెం, చింతల పల్లెలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించమన్నారు. అక్కడ పోలింగ్ రోజు భారీ బందోబస్తు ఉంటుందన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు