బ్యాంకు ఉద్యోగికి ఆన్‌లైన్ మోసగాళ్ల టోకరా
పెనమలూరు, న్యూస్‌టుడే: బ్యాంకు ఉద్యోగికి ఆన్‌లైన్ మోసగాళ్లు రూ.91 వేలకు టోకరా పెట్టారు. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం.. వి.వంశీకృష్ణ చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఓ బ్యాంకులో ఉద్యోగి. అతని ఫోన్ నంబరుతో అనుసంధానమై ఉన్న క్రెడిట్ కార్డును విజయవాడ సమీప కానూరులో నివసించే తల్లి మల్లేశ్వరి వినియోగిస్తుంటారు. రెండ్రోజుల క్రితం వంశీకృష్ణకు ఓ వ్యక్తి ఫోన్ చేసి క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచుతామని, ఫోన్‌కు వచ్చిన ఓటీపీ సంఖ్యను చెప్పాలని కోరాడు. దీంతో అతడు ఆ సంఖ్యను తెలపాల్సిందిగా తల్లిని కోరడంతో ఆమె ఆ వ్యక్తికి చెప్పింది. అనంతరం క్షణాల్లో ఈ కార్డును వినియోగించడం ద్వారా రూ. 91 వేలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. మోసపోయినట్లు గుర్తించిన ఈమె కుమారుడికి విషయాన్ని వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.