logo

ఏఈవోల పదోన్నతుల కల్పనకు కృషి

రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకుల స్థానంలో వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈవోల)ను ఇన్‌ఛార్జులుగా నియమించడం తగదని రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షుడు డి.వి.వేణుగోపాలరావు అన్నారు.

Published : 24 Jan 2022 04:12 IST


ప్రమాణ స్వీకారం చేస్తున్న ఏఈవోల సంఘ కార్యవర్గ సభ్యులు

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకుల స్థానంలో వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈవోల)ను ఇన్‌ఛార్జులుగా నియమించడం తగదని రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షుడు డి.వి.వేణుగోపాలరావు అన్నారు. నగరంలోని గ్రామీణ గుంటూరు మండల పరిషత్తు కార్యాలయం కృషీ భవన్‌లో ఏఈవోల సంఘం జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఆయన మాట్లాడుతూ ఏఈవోల పదోన్నతుల కల్పనకు సంఘం కృషి చేస్తుందన్నారు. అనంతరం జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికయిన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సమావేశంలో రాష్ట్ర ఏఈవోల సంఘం కోశాధికారి సుభాన్‌, సహ అధ్యక్షుడు కె.వి.సత్యనారాయణ, కృష్ణా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికయిన జిల్లా కార్యవర్గం వివరాలివీ.

* జిల్లా అధ్యక్షుడిగా జి.సురేష్‌, కార్యదర్శిగా సీహెచ్‌ బ్రహ్మయ్య, సహ అధ్యక్షుడిగా ఎ.రమేష్‌బాబు, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.ఎం.కృష్ణారావు, ప్రచార కార్యదర్శిగా కె.శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులుగా హరిప్రసాద్‌, ఆర్‌.వెంకయ్య, ఎలీషా, శివాజీ, జోత్స్న, సంయుక్త కార్యదర్శులుగా షేక్‌ ఆరిఫ్‌, టి.రాజేంద్రప్రసాద్‌, ఎం.ప్రభాకర్‌, శేషుబాబు, కె.నాగశ్రీనివాసరావుతో పాటు మరో పది మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని