logo

Omicron: డెల్టాతో పోల్చుకుంటే ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువే!

ఒమిక్రాన్‌ వైరస్‌పై ఓ అంచనాకు రావాలంటే వాస్తవిక సమాచారం రావాల్సి ఉందని సీసీఎంబీ డైరెక్టర్‌ వినయ్‌ కె.నందికూరి అన్నారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో గురువారం

Updated : 17 Dec 2021 08:25 IST

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: ఒమిక్రాన్‌ వైరస్‌పై ఓ అంచనాకు రావాలంటే వాస్తవిక సమాచారం రావాల్సి ఉందని సీసీఎంబీ డైరెక్టర్‌ వినయ్‌ కె.నందికూరి అన్నారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో గురువారం ‘ఒమిక్రాన్‌-ఆల్‌ యూ నీడ్‌ టు నో’ అంశంపై వెబినార్‌ నిర్వహించారు. వినయ్‌ మాట్లాడుతూ.. ఒమిక్రాన్‌ తీవ్రత డెల్టా కంటే తక్కువే అన్నారు. ఒక్క డోసూ తీసుకోని వారికి ఒమిక్రాన్‌ ముప్పు ఎక్కువగా ఉంటుందన్నారు. ఎన్‌ఐటీ(వరంగల్‌) సహాయ ప్రొఫెసర్‌ డా.పెరుగు శ్యామ్‌, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు కె.భాస్కరరెడ్డి, సీనియర్‌ ఉపాధ్యక్షుడు అనిల్‌ అగర్వాల్‌, ఉపాధ్యక్షుడు మీలా జయదేవ్‌, ఎఫ్‌టీసీసీఐ ప్రతినిధులు  పాల్గొన్నారు.


30 ఐసొలేషన్‌ కేంద్రాలు సిద్ధం

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూస్తుండడంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. సర్కిల్‌కు ఒకటి చొప్పున, మొత్తం 30 ఐసొలేషన్‌ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామని కేంద్ర కార్యాలయం తెలిపింది. వైరస్‌ సోకినవారు జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూం 040-2111 1111 నంబరుకు ఫోన్‌ చేసి, ఐసొలేషన్‌ కేంద్రాల వివరాలు తెలుసుకొని ఆశ్రయం పొందొచ్చని గుర్తుచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని