SC Railway: ప్రయాణికుల రద్దీ.. 22 రైళ్లకు అదనపు కోచ్‌లు

ప్రయాణికుల రద్దీతో 22 రైళ్లకు అదనపు కోచ్‌లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటుచేసింది.

Published : 09 May 2024 19:01 IST

సికింద్రాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలోఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులందించే దాదాపు 20కి పైగా రైళ్లకు తాత్కాలికంగా అదనపు కోచ్‌లను ఏర్పాటుచేసింది. దీంతో వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు కొంత ఉపశమనం కలగనుంది. మే 10 నుంచి 14 వరకు ఆయా రైళ్లలో థర్డ్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, స్లీపర్‌, చైర్‌ కార్‌ అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆ రైళ్ల వివరాలివే..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని