logo

Hyderabad News: చెప్పులు లేకుండా 9,999 మేకులపై కూచిపూడి నృత్యం..

చెప్పులు లేకుండా 9,999 మేకులపై కూచిపూడి నృత్యంతో ఏకధాటిగా 9 నిమిషాల పాటు అమ్మవారిని స్తుతిస్తూ తీర్చిదిద్దిన 9 శ్లోకాలకు లయబద్ధంగా నర్తించి ఒకేసారి పది ప్రపంచ రికార్డులు సాధించింది యువ నర్తకి పీసపాటి లిఖిత. ఎలాంటి

Updated : 14 Mar 2022 07:55 IST

ఒకేసారి పది రికార్డులు సాధించిన యువ నర్తకి

నారాయణగూడ, న్యూస్‌టుడే: చెప్పులు లేకుండా 9,999 మేకులపై కూచిపూడి నృత్యంతో ఏకధాటిగా 9 నిమిషాల పాటు అమ్మవారిని స్తుతిస్తూ తీర్చిదిద్దిన 9 శ్లోకాలకు లయబద్ధంగా నర్తించి ఒకేసారి పది ప్రపంచ రికార్డులు సాధించింది యువ నర్తకి పీసపాటి లిఖిత. ఎలాంటి దోషాలు లేకుండా తన అభినయ కౌశలంతో అమ్మవారి అవతారాలను కళ్లముందు కదలాడేలా చేసింది. అవనీ నృత్యాలయం ఆధ్వర్యంలో ఐ.ఎస్‌.కె.విజేందర్‌, ఎ.ధనలక్ష్మి పర్యవేక్షణలో ఆదివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో ‘వరల్డ్‌ రికార్డ్స్‌, భారత్‌ వరల్డ్‌ రికార్డ్స్‌, టాలెంట్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌, ట్రెడిషనల్‌ వరల్డ్‌ రికార్డ్స్‌, వండర్‌ ఇండియా రికార్డ్స్‌, దిల్లీ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌, సంస్కృతి సంప్రదాయ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌, సకల కళాకారుల ప్రపంచ పుస్తకం, ఎక్స్‌ట్రాడినరీ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌, ప్రైడ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ల కోసం లిఖిత ‘నవదుర్గ’ అంశంతో ప్రత్యేక ప్రయోగం చేసి విజయవంతంగా ముగించింది. తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డా.వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. పది రికార్డులు సాధించి లిఖిత కారణజన్మురాలిగా నిలిచిందన్నారు. ఆయా రికార్డుల ప్రతినిధులు లిఖితకు ధ్రువపత్రాలు అందించి సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని