logo

బాలచైతన్య కార్యక్రమానికి యునెస్కో ప్రశంసలు

అఖండ బళ్లారి జిల్లాలో గత ఏడాది జూన్‌లో బాలచైతన్య కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు యునెస్కో ప్రశంసలు లభించాయి. కరోనా మూడో అల పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు, అధ్యయనాలు వెల్లడించాయి. అపౌష్టికతతో

Published : 28 Jan 2022 01:29 IST

హొసపేటెలోని బాలచైతన్య కేంద్రంలో చిన్నారులు (దాచినచిత్రం)

హొసపేటె, న్యూస్‌టుడే: అఖండ బళ్లారి జిల్లాలో గత ఏడాది జూన్‌లో బాలచైతన్య కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు యునెస్కో ప్రశంసలు లభించాయి. కరోనా మూడో అల పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు, అధ్యయనాలు వెల్లడించాయి. అపౌష్టికతతో బాధపడే వారికి కరోనా సోకుతుందని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 8 తాలూకాల్లో ఏకకాలంలో బాలచైతన్య కేంద్రాలను ప్రారంభించారు. తీవ్ర అపౌష్టికతతో బాధపడుతున్న బాలలను గుర్తించి వారిని ఈ కేంద్రాల్లో చేర్చి పౌష్టికాహారాన్ని అందించారు. రెండు జిల్లాల్లో మొత్తం 827 మందిని చైతన్య కేంద్రాల్లో చేర్చి ఆరు నెలలపాటు పౌష్టికాహారం అందించారు. 461మంది తీవ్ర అపౌష్టికత ఇబ్బంది నుంచి బయటపడ్డారు. సాధారణ అపౌష్టికతతో బాధపడుతున్న 45,774 మందిలో 24,506 మంది పరిస్థితి మెరుగుపడింది. బళ్లారి జిల్లాలో సాధించిన ఈ ఫలితాలు యునెస్కో దృష్టికి వెళ్లాయి. ఈ అంశాన్ని యునెస్కో ‘పోషన్‌ వీక్లీ’ మేగజైన్‌లో ప్రచురించింది. బళ్లారి జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌, జడ్పీ సీఈవో కె.ఆర్‌.నందిని కృషితో ఈ ఫలితాలు సాధించాం. జిల్లాలో సాధించిన ఫలితాలపై నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు విజయనగర జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ బాధ్య ఉప సంచాలకుడు నాగరాజ్‌ పేర్కొన్నారు. ఈ గుర్తింపుతో మరింత ఉత్సాహంతో బాలల ఆరోగ్య సంరక్షణపై కార్యక్రమాలు రూపొందించే ఆలోచన ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని