logo
Published : 29/11/2021 00:35 IST

దిగి వస్తున్న టమాటా

ఈనాడు, హైదరాబాద్‌: టమాటా ధర నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. నాణ్యమైన టమాటా మార్కెట్లో రూ.40 నుంచి రూ.50 లోపు దొరుకుతుంటే.. కాస్త తక్కువ రకం రూ.100కి మూడు కిలోలు చొప్పున అమ్ముతున్నారు. లోకల్‌గా పండిన పంట మార్కెట్‌కు వస్తుండడంతో ధరలు తగ్గుతున్నాయని బోయినపల్లి మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు. 

పెరిగిన రాక.. సాధారణంగా చిత్తూరు జిల్లా మదనపల్లి, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి భారీగా నగరానికి టమాటా వస్తుంది.  ఇటీవల తమిళనాడుతో పాటు రాయలసీమను వర్షాలు ముంచెత్తడంతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. నగరంలో బోయినపల్లి హోల్‌సేల్‌ మార్కెట్‌కు ఈ నెల 17న 974, 20న 885, 23న 953 క్వింటాళ్లు వచ్చింది. దీంతో కిలో రూ.100కి అటుఇటుగా అమ్మకాలు జరిగాయి. 28న 2302 క్వింటాళ్లు రావడంతో ధర తగ్గింది. రైతుబజారులో రూ.34కు విక్రయిస్తున్నారు. టమాటాతో పాటు.. మిగతా కూరగాయల ధరలూ తగ్గుతున్నాయి. రైతుబజారులో రూ.50కి తగ్గని ధరలు స్థానిక పంటలు మార్కెట్‌ వస్తుండడంతో నల్ల వంకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.35, ఆలుగడ్డ రూ.27, ఉల్లిగడ్డ రూ.24, కాలీఫ్లవర్‌ రూ.28కి విక్రయిస్తున్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని