logo

మాంజా చుట్టుకొని గొంతుకు తీవ్ర గాయం

గాలిపటాలు ఎగురవేయడానికి ఉపయోగించే మాంజా మెడకు చుట్టుకోవడంతో తీవ్రంగా గాయపడిన యువకుడికి హైదర్‌గూడ అపోలో ఆసుపత్రి కార్డియోవాస్కులర్‌ సర్జికల్‌ వైద్యుల బృందం శస్త్రచికిత్స చేసి ప్రాణాలను

Published : 18 Jan 2022 02:24 IST

అయాన్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: గాలిపటాలు ఎగురవేయడానికి ఉపయోగించే మాంజా మెడకు చుట్టుకోవడంతో తీవ్రంగా గాయపడిన యువకుడికి హైదర్‌గూడ అపోలో ఆసుపత్రి కార్డియోవాస్కులర్‌ సర్జికల్‌ వైద్యుల బృందం శస్త్రచికిత్స చేసి ప్రాణాలను కాపాడింది. మహారాష్ట్రకు చెందిన అయాన్‌ (22) హైదరాబాద్‌లో ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. ఆదివారం ద్విచక్ర వాహనంపై లిబర్టీ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వెళుతున్నాడు. ఈ క్రమంలో చైనా మాంజా గొంతుకు చుట్టుకొని గాయమైంది. స్థానికులు వెంటనే హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి తరలించారు. చీఫ్‌ కార్డియాక్‌ సర్జన్‌ కె.వెంకట్‌రెడ్డి బృందం శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రివర్గాలు తెలిపాయి.


మరో ఘటనలో డేగ..

డేగను చూపుతున్న సొసైటీ సభ్యులు

పంజాగుట్ట, న్యూస్‌టుడే: చింతల్‌బస్తీలోని ఖైరతాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆవరణలోని చెట్టుపై మాంజా చుట్టుకొని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న డేగను గమనించిన స్థానిక యువకుడు రాజశేఖర్‌ ముదిరాజ్‌ ఏనిమల్‌ వారియర్స్‌ సొసైటీకి సమాచారం అందించారు. వెంటనే కళాశాల వద్దకు చేరుకొన్న సొసైటీ సభ్యుల బృందం అనిల్‌రుద్‌, రాఘవ్‌, గణేష్‌, ప్రభు చెట్టుపైకి ఎక్కి ప్రత్యేక సాధనంతో మాంజా తొలగించారు. డేగ రెక్క కోల్పోయిందని, పూర్తిగా కోలుకునేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో జూ పార్కుకు పంపించినట్లు సంస్థ సంయుక్త కార్యదర్శి మనీష్‌ తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని