logo

రక్తపు మడుగులో కొన ఊపిరితో వ్యక్తి

శరీరంపై బలమైన గాయాలకుతోడు రక్తపు మడుగులో ఓ వ్యక్తి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించిన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం బాడేపల్లి

Published : 20 Jan 2022 03:11 IST


గాయాలతో జివ్వాజి నర్సింహ

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: శరీరంపై బలమైన గాయాలకుతోడు రక్తపు మడుగులో ఓ వ్యక్తి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించిన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం బాడేపల్లి ప్రాంతానికి చెందిన జివ్వాజి నర్సింహ ప్లంబర్‌గా పనిచేస్తుంటాడు. తల్లిదండ్రులకు, భార్యకు దూరమైన ఆయన చాలారోజులుగా స్థానిక జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసైన అతడు ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి అతడు తెలిసినవారికి, చుట్టుపక్కల వారికి ఫోన్‌ చేస,ి తనకు భయంగా ఉందని, తనను ఎవరో చంపడానికి వస్తున్నారని చెప్పాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం చుట్టుపక్కల వారు నర్సింహ కోసం చూడగా.. ఇంటికి తాళం ఉండడాన్ని గుర్తించి కిటికీలో నుంచి పరిశీలించారు. ఇంట్లో రక్తం మడుగులో, చేతితో పాటు కాళ్లపై, గొంతు వద్ద గాయాలతో కొన ఊపిరితో అతడు ఉండడాన్ని గమనించి అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని బాధితుడిని చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే, కుటుంబీకులకు దూరమైన నర్సింహ మానసిక సమస్యలతో ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో గతంలో చికిత్స పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నర్సింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తనను తాను గాయపర్చుకున్నాడా?.. లేక ఎవరైనా దాడిచేసి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటికి బయట నుంచి తాళం, ఇంట్లో గడియ ఎవరు వేశారో తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు తెలిపారు. అతడు గాయాల నుంచి కోలుకుంటే ఘటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని