icon icon icon
icon icon icon

Amit Shah: ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను భాజపా కాపాడుతుంది: అమిత్ షా

 కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్‌ వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

Published : 05 May 2024 17:34 IST

కాగజ్‌నగర్‌: కేంద్రంలో మరోసారి మోదీ సర్కారు వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో రెండు విడతల పోలింగ్‌ ముగిసింది. తొలి రెండు విడతల్లో భాజపా సెంచరీ కొడుతుంది. తెలంగాణలో కొన్నాళ్లుగా భాజపాకు ఓట్ల శాతం పెరుగుతోంది. ఈసారి రాష్ట్రంలో పది ఎంపీ సీట్లలో విజయం సాధిస్తుంది. 

పండుగలను కూడా సైనికుల మధ్య జరుపుకొనే మోదీ ఓ వైపు.. సెలవుల కోసం బ్యాంకాక్‌ టూర్లు వేసే రాహుల్‌ బాబా మరో వైపు ఉన్నారు. నేను ఎక్కడకు వెళ్లినా ‘మోదీ.. మోదీ’ నినాదాలే వినిపిస్తున్నాయి. 70 ఏళ్లుగా అయోధ్య రామమందిరం నిర్మాణం జరగకుండా కాంగ్రెస్‌ అడ్డుకుంది. రెండోసారి ప్రధానిగా మోదీ వచ్చాకే రామమందిరం ప్రతిష్ఠ జరిగింది. ఖర్గే, రాహుల్‌ ఇద్దరినీ ఆ కార్యక్రమానికి ఆహ్వానించాం. తమ ఓటు బ్యాంకు పోతుందని వారిద్దరూ అయోధ్యకు రాలేదు. ఖర్గే ఓటు బ్యాంకు, ఒవైసీ ఓటు బ్యాంకు ఒక్కటే. పాకిస్తాన్‌ ఇంట్లోకి వెళ్లి మరీ సర్జికల్‌ స్ట్రైక్‌ ద్వారా తీవ్రవాదులను మట్టుబెట్టాం. ఇప్పుడు కశ్మీర్‌లో భారత జెండా సగర్వంగా ఎగురుతోంది. భాజపా వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఓ ఫేక్‌ వీడియోను కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది. నా మాటలను వక్రీకరించి ఫేక్‌ వీడియో సృష్టించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను భాజపా కాపాడుతుంది. గతంలో భారాస అవినీతి చేసేది..ఇప్పుడు కాంగ్రెస్‌ చేస్తోంది’’ అని అమిత్‌ షా విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని