icon icon icon
icon icon icon

Amit Shah: నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాన్ని కేసీఆర్‌ నిలబెట్టుకోలేదు: అమిత్‌ షా

నిరుద్యోగులకు రూ.3,016 భృతి ఇస్తామన్న కేసీఆర్‌ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు.

Updated : 25 Nov 2023 17:53 IST

పటాన్‌చెరు: నిరుద్యోగులకు రూ.3,016 భృతి ఇస్తామన్న వాగ్దానాన్ని కేసీఆర్‌ నిలబెట్టుకోలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న ఆయన హామీ ఏమైందని ప్రశ్నించారు. దేశంలో రెండున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తే.. ఒక్క పేపర్‌ కూడా లీక్‌ కాలేదని, కానీ తెలంగాణలో మాత్రం పేపర్‌ లీకేజీలతో నిరుద్యోగుల నోట్లో  కేసీఆర్‌ మట్టి కొట్టారని విమర్శించారు. పటాన్‌చెరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌ షా మాట్లాడారు. 

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. భారాసకు వేసినట్లేనని అమిత్‌షా విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. అందులో 12 మంది భారాసలో చేరిపోయారన్నారు.  భారాస ప్రభుత్వం మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని చెప్పారు. భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని రద్దు చేసి.. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. సెప్టెంబర్‌ 17న  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు ఓట్లు అడిగే హక్కు భారాస పార్టీకి లేదని అన్నారు. భాజపా అధికారంలోకి వస్తే.. బీసీని సీఎం చేస్తామని పునరుద్ఘాటించారు. భారాస ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఓటర్లకు అమిత్‌షా పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img