icon icon icon
icon icon icon

Bandi Sanjay: రుణమాఫీ అంశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానిది మోసం: బండి సంజయ్‌

తన లోక్‌సభ నియోజకవర్గానికి ఐదేళ్లలో రూ.12 వేల కోట్ల నిధులు తెచ్చినట్లు ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు.

Published : 21 Apr 2024 14:24 IST

సిరిసిల్ల: తన లోక్‌సభ నియోజకవర్గానికి ఐదేళ్లలో రూ.12 వేల కోట్ల నిధులు తెచ్చినట్లు కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు. సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ కాంగ్రెస్‌కు అభ్యర్థులు కూడా లేరని ఎద్దేవా చేశారు. కరోనా వేళ ప్రజలకు అనేక సేవలందించినట్లు చెప్పారు. ఆ సమయంలో భారాస, కాంగ్రెస్‌ నేతలు అసలు బయటకు కూడా రాలేదన్నారు. అప్పుడు 8 మంది భాజపా కార్యకర్తలు కరోనాతో చనిపోయారని చెప్పారు. రైతులకు నష్టపరిహారం కోసం  పోరాడింది తామేనన్నారు. రుణమాఫీ అంశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బండి సంజయ్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img