icon icon icon
icon icon icon

Dharmapuri Arvind: మహిళలు, రైతులను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్‌ రెడ్డి: ఎంపీ అర్వింద్‌

మహిళలు, రైతులను మోసం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గద్దెనెక్కారని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ విమర్శించారు....

Published : 04 May 2024 23:58 IST

ఆలూరు: మహిళలు, రైతులను మోసం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గద్దెనెక్కారని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో శనివారం కార్నర్ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అర్వింద్‌ మాట్లాడుతూ..  ‘‘సీఎం రేవంత్ రెడ్డి.. కొత్తగా వివాహం జరిగిన ఆడపిల్లలకు తులం బంగారం ఇచ్చారా? రైతులకు ‘రైతు భరోసా’ ఇచ్చారా?ఆరు గ్యారంటీల పేరుతో ఆరు గుడ్లు పెట్టారు. ఇప్పుడు గాడిద గుడ్డు పేరుతో విమర్శలు చేస్తున్నారు. కేంద్రం ఉచితంగా రేషన్ సరఫరా చేస్తుండగా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వడం లేదు. నిజామాబాద్‌ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి రైతులకు ఎలాంటి మేలు చేశారో చెప్పాలి. ఆర్మూర్ నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడి రైతులు బంగారం పండిస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు డ్రై పోర్టును ఏర్పాటు చేస్తాం. జక్రాన్ పల్లి విమానాశ్రయం ఏర్పాటుతో పాటు ఆర్మూర్‌లో నవోదయ పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తాం’’ అని అర్వింద్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img