icon icon icon
icon icon icon

TS news: ఎన్నికల విధులకు గైర్హాజరు.. 48 మంది ఉద్యోగులపై కేసు నమోదు

ఎన్నికల విధులకు గైర్హాజరైన 48 మంది ప్రభుత్వ ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 12 May 2024 22:26 IST

దేవరకొండ: నల్గొండ జిల్లా దేవరకొండలో 48 మంది ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో.. ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై దేవరకొండ ఆర్డీవో శ్రీరాములు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు గైర్హాజరైన ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎన్నికల సంఘానికి భారాస లేఖ

సోమవారం పోలింగ్‌ జరగనున్న తరుణంలో దేవరకొండకు అదనపు పోలీసులు, కేంద్ర బలగాలు పంపాలంటూ ఎన్నికల సంఘానికి భారాస లేఖ రాసింది. కాంగ్రెస్‌ ఇక్కడ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img