icon icon icon
icon icon icon

Revanth Reddy: పసుపు బోర్డు ఏర్పాటులో నిజామాబాద్‌ పేరెక్కడ?: సీఎం రేవంత్‌రెడ్డి

సెప్టెంబర్‌ 17లోపు చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు

Published : 22 Apr 2024 16:26 IST

నిజామాబాద్‌: సెప్టెంబర్‌ 17లోపు చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ‘జనజాతర’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై మోదీ ఇచ్చిన ప్రకటనలో ఎక్కడా నిజామాబాద్‌ పేరు లేదన్నారు. నిజామాబాద్‌లోనే బోర్డు ఏర్పాటు అని స్పష్టంగా చెప్పకుండా నోట్‌ విడుదల చేశారని విమర్శించారు. ఎన్నికలు అయ్యాక బోర్డును ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియదన్నారు.  

‘‘నిజామాబాద్‌ అంటే నాకు ప్రత్యేక అభిమానం. అధికారంలోకి రాగానే చక్కెర పరిశ్రమలు పునరుద్ధరణ గురించి ఆలోచించాం. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడి రైతులను పట్టించుకోలేదు. పసుపు బోర్డు ఏర్పాటుపై బాండు రాసి ఇచ్చి భాజపా ఎంపీ అర్వింద్‌ మోసం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ కూటమి తప్పక ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. చక్కెర పరిశ్రమ, పసుపు బోర్డులను జీవన్‌రెడ్డి సాధిస్తారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి. కానీ, మోదీ దేవుడిని, భక్తిని ఓట్లుగా మార్చుకుంటున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడాలంటే మళ్లీ కాంగ్రెస్‌ గెలవాలి’’అని రేవంత్‌రెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img