icon icon icon
icon icon icon

Revanth Reddy: రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర: సీఎం రేవంత్‌రెడ్డి

అన్నింటా జీఎస్టీ విధించి ఎన్డీయే ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.

Published : 25 Apr 2024 12:53 IST

హైదరాబాద్‌: అన్నింటా జీఎస్టీ విధించి ఎన్డీయే ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. అగ్గిపెట్టె, సబ్బుబిళ్ల కూడా దానికి అతీతం కాదని చాటిచెప్పారని ఎద్దేవా చేశారు. పదేళ్ల ఎన్డీయే పాలనపై గాంధీభవన్‌లో నిర్వహించిన ఛార్జ్‌షీట్‌ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

‘‘కార్పొరేట్‌ కంపెనీలకు ఎన్డీయే ప్రభుత్వం లొంగిపోయింది. గత ప్రధానులందరూ కలిసి రూ.54 లక్షల కోట్లు అప్పులు చేశారు. కానీ పదేళ్లలో మోదీ ప్రభుత్వం రూ.113 లక్షల కోట్ల అప్పులు చేసింది. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారులను కార్పొరేట్లకు కట్టబెట్టారు. రూ.60 లక్షల కోట్ల ఆస్తులను రూ.6 లక్షల కోట్లకు తెగనమ్మారు. డబుల్‌ ఇంజిన్‌ పేరిట దేశాన్ని భాజపా దోచుకుంది. 

స్విస్‌ బ్యాంకుల్లోని నల్లధనం తెచ్చి ప్రజలకు పంచుతామన్నారు. ఖాతాల్లో రూ.15లక్షల చొప్పున జమ, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు తదితర హామీలతో ప్రధాని మోదీ మోసగించారు. మూడు నల్లచట్టాలను తీసుకొచ్చి రైతులను బానిసలుగా మార్చేందుకు యత్నిస్తున్నారు. కాంగ్రెస్‌పై విష ప్రచారం చేసి ఎలాగైనా గెలవాలని భాజపా అనుకుంటోంది. రాజ్యాంగం కల్పించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తోంది. దీని కోసం ఆ పార్టీకి 400 సీట్లు కావాలి. ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను భాజపా అమలు చేసింది. అందుకే రాజ్యాంగంపై ఆఖరి యుద్ధం ప్రకటించింది’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని