icon icon icon
icon icon icon

Revanth Reddy: నిన్నటి వరకు సీబీఐ, ఈడీ.. ఇప్పుడు దిల్లీ పోలీసులు: రేవంత్‌రెడ్డి

అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ వ్యవహారంలో తనతోపాటు పలువురికి దిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు.

Published : 29 Apr 2024 17:42 IST

హైదరాబాద్‌: అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ వ్యవహారంలో తనతోపాటు పలువురికి దిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. భాజపాపై పోరాడే వారికి అమిత్‌షా నోటీసులు పంపిస్తున్నారని విమర్శించారు. భాజపాను ప్రశ్నించినందుకే తమకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. మోదీ ఇప్పటి వరకు విపక్షాలపై సీబీఐ, ఈడీని ప్రయోగించారని, ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పుడు దిల్లీ పోలీసులనూ ప్రయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎవరూ భయపడేవాళ్లు లేరన్న సీఎం రేవంత్‌.. తెలంగాణ, కర్ణాటకల్లో భాజపాను ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img