icon icon icon
icon icon icon

CM Revanth Reddy: రిజర్వేషన్ల రద్దే భాజపా అజెండా: సీఎం రేవంత్‌రెడ్డి

70 ఏళ్లుగా అమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని భాజపా తలపెట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 

Published : 25 Apr 2024 20:39 IST

హైదరాబాద్‌: 70 ఏళ్లుగా అమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని భాజపా తలపెట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి మద్దతుగా గురువారం రాత్రి హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో సీఎం ప్రసంగించారు. 400 ఎంపీ సీట్లు వస్తే.. రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తోందన్నారు. పార్లమెంట్‌లో మూడొంతుల మెజార్టీ వస్తే.. రిజర్వేషన్లు రద్దు చేయడమే ఆ పార్టీ అజెండా అని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలు, అజెండానే మోదీ సర్కారు అమలు చేస్తోందన్నారు.

‘‘డిసెంబరు 3న తెలంగాణ ప్రజలు కారును షెడ్డుకు పంపించారు. షెడ్డుకు పోయిన కారు తుప్పు పట్టిపోయింది.. అది ఇక రాదు.  అందుకే బస్సు వేసుకుని బయల్దేరారు. వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్టు కేసీఆర్‌ వైఖరి ఉంది. పదేళ్లు ముఖ్యమంత్రిగాఉన్న కేసీఆర్‌ ఎప్పుడైనా బయటికి వచ్చి రైతులతో మాట్లాడారా? పంటలు పరిశీలించారా? నాలుగు గంటలు టీవీలో మాట్లాడిన కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి ఎందుకు సమాధానాలు చెప్పలేదు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.

కాంగ్రెస్‌ పార్టీకి అధికారం కొత్తకాదు. 70 ఏళ్లలో దాదాపు 50 ఏళ్లపాటు రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలను నడిపింది. పేద ప్రజలకోసం పనిచేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ కారిడార్‌ను మోదీ అడ్డుకున్నారు. రైతుల ఆదాయం పెంచుతామన్న మోదీ.. రైతుల ఖర్చులు పెంచారు. నల్లచట్టాలు తెచ్చి 3వేల మంది రైతుల ప్రాణాలు బలి తీసుకున్నారు’’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img