icon icon icon
icon icon icon

Revanth Reddy: గుజరాత్‌ పెత్తనమా..? తెలంగాణ పౌరుషమా?: రేవంత్‌

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్‌ భాజపాతో పొత్తు పెట్టుకోబోతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 30 Apr 2024 20:33 IST

రేగొండ: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్‌ భాజపాతో పొత్తు పెట్టుకోబోతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భారాసకు ఒక్క ఓటు వేసినా అది వృథానే అవుతుందని అన్నారు. కారు కార్ఖానాకు పోయిందని, దానిని బజారులో తూకానికి అమ్మాల్సిందేనని వ్యాఖ్యానించారు. భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్‌ ప్రసంగించారు. వరంగల్‌ పట్టణానికి ఔటర్ రింగ్‌ రోడ్డు, ఎయిర్‌పోర్టు రాకుండా మోదీ అడ్డుకున్నారని విమర్శించారు. 

‘‘ హామీల గురించి అడిగితే నాపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర చేస్తోంది. అందుకే భాజపా 400 సీట్లు కావాలని అంటోంది. అమిత్‌ షాను కేసీఆర్‌ ఆవహించినట్లున్నారు. అందుకే దిల్లీ పోలీసులను గాంధీభవన్‌కు పంపించారు. నన్ను అరెస్టు చేయాలని ఆదేశించారు. గుజరాత్‌ పెత్తనమా? తెలంగాణ పౌరుషమా? తేల్చుకుందాం. దిల్లీ పోలీసుల్ని కాదు.. సరిహద్దులో సైనికుల్ని తెచ్చుకున్నా భయపడను. గుజరాత్‌ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. భాజపా, భారాస ఒక్కటే. భాజపాతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు’’ అని రేవంత్ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img