icon icon icon
icon icon icon

Revanth Reddy: కారు షెడ్డుకు పోయింది.. మళ్లీ రాదు: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌కు వచ్చే పెట్టుబడులు గుజరాత్‌కు తరలించుకుపోవాలనేది భాజపా కుట్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Published : 10 May 2024 20:05 IST

షాద్‌నగర్‌: హైదరాబాద్‌కు వచ్చే పెట్టుబడులు గుజరాత్‌కు తరలించుకుపోవాలనేది భాజపా కుట్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. అభివృద్ధి జరగాలన్నా.. ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా.. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న మతకలహాల వల్లే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర బహిరంగ సభలో రేవంత్‌ ప్రసంగించారు. హైదరాబాద్‌కు ఓఆర్‌ఆర్‌, విమానాశ్రయం, పరిశ్రమలను గత కాంగ్రెస్‌ ప్రభుత్వమే తీసుకొచ్చిందని గుర్తు చేసిన రేవంత్‌.. అవన్నీ వచ్చాకే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు అమాంతం పెరిగాయన్నారు. 

‘‘మత కలహాలు లేవు కాబట్టే హైదరాబాద్‌ ఖ్యాతి అంతర్జాతీయంగా పెరిగింది. గుజరాత్‌ కంటే హైదరాబాద్‌ ఖ్యాతి పెరగడంతో దానిని తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారు. మతచిచ్చు పెట్టి శాంతిభద్రతలు చెడగొట్టాలని చూస్తున్నారు. భాజపా వాళ్ల మాటలు నమ్మి రాష్ట్రాన్ని ఆగం చేసుకోవద్దు. ఎయిర్‌పోర్టు వరకు మెట్రో తెస్తా. ఆ తర్వాత షాద్‌నగర్ వరకు విస్తరిస్తా. ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చేందుకు కృషి చేస్తాం. పాలమూరు బిడ్డకు, దిల్లీ సుల్తాన్‌లకు మధ్య జరుగుతున్న పోరు ఇది. షెడ్డుకు పోయిన కారు.. మళ్లీ తిరిగిరాదని చెప్పాను. కారు తుప్పుపట్టిపోయినందువల్లే.. కేసీఆర్‌ బస్సెక్కి తిరుగుతున్నారు’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img