icon icon icon
icon icon icon

CM Revanthreddy: పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్‌ అభివృద్ధి: సీఎం రేవంత్‌రెడ్డి

రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన స్పష్టంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 

Published : 10 May 2024 22:39 IST

హైదరాబాద్‌: రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన స్పష్టంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలన్నీ అభివృద్ధి, సంక్షేమం చుట్టూ నడిచాయని, ప్రస్తుత అవి పక్కకు వెళ్లాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ తాజ్‌ డెక్కన్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాజ్యాంగమే భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ అని, బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడేలా రాజ్యాంగ రచన జరిగిందని పేర్కొన్నారు. దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే కాంగ్రెస్‌ విధివిధానాలను రూపొందించిందని చెప్పారు. 

‘‘ భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి జరగలేదు. దిల్లీకి కూతవేటు దూరంలో ఉన్న యూపీకి పెట్టుబడులు రాలేదు. భాజపా తీసుకుంటున్న విధానాలే అందుకు కారణం. పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతోంది. పదేళ్లలో కేసీఆర్‌ వందేళ్ల విధ్వంసం చేశారు. రాష్ట్రంలో భాజపా అడుగుపెడితే.. సమాజం రెండుగా చీలిపోతుంది. భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవడమే మోదీ విధానం. కాంగ్రెస్‌ ఆస్తులు గుంజుకుంటుందని మోదీ విష ప్రచారం చేస్తున్నారు. అన్ని సంస్థలను భాజపా చెరబట్టింది. రాజ్యాంగాన్ని మారుస్తామని మోదీ అంటున్నారు. ప్రజలకు స్వేచ్ఛ అందించాలనే లక్ష్యంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. 

భాజపాకు రాష్ట్రాన్ని అప్పగించడానికి కుట్ర జరుగుతోంది. మతాలు, భాషలు, వ్యక్తుల మధ్య భాజపా విషం చిమ్ముతోంది. 2025 నాటికి రిజర్వేషన్ల రద్దు అనేది కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాలోనే ఉంది. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు ఈసీ కాకుండా కేంద్ర హోంశాఖ నాపై ఎందుకు చర్యలకు సిద్ధమైంది. ఇవాళ 300 మంది దిల్లీ పోలీసులను తెలంగాణలో కేంద్ర హోంశాఖ మోహరించింది. ఇవాళ మోదీ, అమిత్ షా నాపైనే ఎక్కువగా దృష్టి సారించారు. నేను లేవనెత్తిన అంశం వాస్తవమైనది అయినందునే నాపై దృష్టి పెట్టారు. రాహుల్‌ గాంధీ మీద ప్రధాని మోదీ అవినీతి ఆరోపణలు ఎలా చేస్తారు’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img