icon icon icon
icon icon icon

Congress: ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్‌ వియ్యంకుడు

తెలంగాణలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది.

Updated : 24 Apr 2024 21:51 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ బుధవారం రాత్రి ప్రకటించారు. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి మహమ్మద్‌ సమీర్‌, ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి, కరీంనగర్‌ అభ్యర్థిగా రాజేందర్‌రావు పేర్లు ఖరారు చేశారు. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. కరీంనగర్‌ నుంచి రాజేందర్‌రావు ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేశారు.

ఖమ్మం అభ్యర్థిగా ఖరారైన రామసహాయం రఘురాంరెడ్డి సినీ హీరో వెంకటేశ్‌, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వియ్యంకుడు. ఆయన తండ్రి సురేందర్‌రెడ్డి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత. గతంలో పలుసార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా సేవలందించారు. ప్రస్తుతం వయసురీత్యా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో రఘురాంరెడ్డి రంగంలోకి దిగారు. ఆయనకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన కుటుంబాలతో బంధుత్వం ఉంది. హీరో వెంకటేశ్‌ కుమార్తె అశ్రితను ఆయన పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి వివాహం చేసుకోగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డిని ఆయన చిన్నకుమారుడు అర్జున్ రెడ్డి వివాహమాడారు. అలా.. ఇటు వెంకటేశ్‌కి, అటు మంత్రి పొంగులేటికి రఘురాంరెడ్డి వియ్యంకుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img