icon icon icon
icon icon icon

మైనారిటీలకు కాంగ్రెస్‌ అన్యాయం

మైనారిటీలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, ఒక్కరికి కూడా మంత్రిపదవి ఇవ్వలేదని భారాస సీనియర్‌ నేత, మాజీ హోంమంత్రి మహమూద్‌ అలీ విమర్శించారు.

Published : 21 Apr 2024 04:12 IST

మాజీ హోంమంత్రి మహమూద్‌ అలీ

ఈనాడు, హైదరాబాద్‌: మైనారిటీలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, ఒక్కరికి కూడా మంత్రిపదవి ఇవ్వలేదని భారాస సీనియర్‌ నేత, మాజీ హోంమంత్రి మహమూద్‌ అలీ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘‘మైనారిటీల అభివృద్ధి కోసం కేసీఆర్‌ చాలా కార్యక్రమాలు చేశారు. వారి కోసం 204 గురుకుల పాఠశాలలు స్థాపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో ముస్లింలు అనాథలయ్యారు. కేసీఆర్‌ పదేళ్ల కష్టాన్ని కాంగ్రెస్‌ నేతలు నాలుగు నెలల్లో నాశనం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మైనారిటీల కోసం ఏమీ లేవు. ప్రజల్లో మార్పు మొదలైంది. భారాస 12 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుంది. కేసీఆర్‌ హయాంలో 12 మసీదులను కూల్చారని రేవంత్‌రెడ్డి చెప్పడం అర్థరహితం’’ అని మహమూద్‌ అలీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img