icon icon icon
icon icon icon

మెదక్‌ అభివృద్ధి ప్రధాని మోదీ ఘనతే

మెదక్‌ జిల్లాను నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని మెదక్‌ భాజపా లోక్‌సభ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు.

Published : 21 Apr 2024 04:14 IST

భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: మెదక్‌ జిల్లాను నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని మెదక్‌ భాజపా లోక్‌సభ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడితే మెదక్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేయకూడదా అని అన్నారు. గతంలో కొడంగల్‌లో ఓడిన రేవంత్‌రెడ్డి మల్కాజ్‌గిరి నుంచి లోక్‌సభకు పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు. మెదక్‌ రైల్వేలైను దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో రాలేదని ప్రధాని మోదీ పాలనలో వచ్చిందని పేర్కొన్నారు. రైతు రుణమాఫీకి ఆగస్టు నెలకు సంబంధం ఏమిటని రఘునందన్‌రావు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img