icon icon icon
icon icon icon

కేసీఆర్‌ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బస్సు యాత్ర కాదు కదా మోకాళ్ల యాత్ర చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు.

Published : 21 Apr 2024 04:14 IST

భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బస్సు యాత్ర కాదు కదా మోకాళ్ల యాత్ర చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో భాజపా, ప్రధాని మోదీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 12కు పైగా స్థానాల్లో గెలవడం ఖాయమన్నారు. మోదీ చరిష్మాను తగ్గించి చూపేందుకు భారాస, కాంగ్రెస్‌ ఒప్పందం చేసుకున్నాయని చేరికలపై రెండు పార్టీలు కలిసి గేమ్‌ ఆడుతున్నాయని ఆరోపించారు. హామీలు అమలు చేయలేక సీఎం రేవంత్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి దేశంలో, భారాసకు రాష్ట్రంలో భవిష్యత్తు లేదన్నారు. త్వరలో వికసిత్‌ తెలంగాణకు అనుకూలంగా భాజపా సంకల్ప పత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img