icon icon icon
icon icon icon

అధికారం కోసం జెండాలు మారిస్తే తిరస్కరణే

అధికారంలో ఉన్నన్ని రోజులు అనుభవించి.. ఆ తర్వాత పార్టీకి, నాయకత్వానికి నమ్మకద్రోహం చేసిన రంజిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి వైఖరిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మండిపడ్డారు.

Published : 21 Apr 2024 04:15 IST

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

ఈనాడు- హైదరాబాద్‌: అధికారంలో ఉన్నన్ని రోజులు అనుభవించి.. ఆ తర్వాత పార్టీకి, నాయకత్వానికి నమ్మకద్రోహం చేసిన రంజిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి వైఖరిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మండిపడ్డారు. భారాస, కేసీఆర్‌ వారికి ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు. అధికారం కోసం జెండాలు మార్చే వారిని ప్రజలు తిరస్కరిస్తారని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌ నందినగర్‌లోని మాజీ సీఎం కేసీఆర్‌ నివాసంలో భారాస చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ సమీక్ష సమావేశం కేటీఆర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చేవెళ్లలో కేసీఆర్‌ బహిరంగ సభ తర్వాత కాసాని విజయం ఖాయమైంది. 30 ఏళ్లుగా బడుగు, బలహీనవర్గాలతోపాటు సమాజంలోని అన్ని వర్గాల కోసం పనిచేసిన జ్ఞానేశ్వర్‌కు ఈ ఎన్నికల్లో గెలుపు తథ్యం. ఆయన రంగారెడ్డి జిల్లాపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు’’ అని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img