icon icon icon
icon icon icon

రెండు పరివార్‌ల మధ్య యుద్ధంలో మాదే విజయం

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు మోదీ, కాంగ్రెస్‌ పరివార్‌ల మధ్య జరిగే యుద్ధమని, ఇందులో తమదే విజయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 21 Apr 2024 04:17 IST

బెంగళూరు సభలో సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, బెంగళూరు: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు మోదీ, కాంగ్రెస్‌ పరివార్‌ల మధ్య జరిగే యుద్ధమని, ఇందులో తమదే విజయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి మన్సూర్‌ అలీఖాన్‌ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ఈవీఎం, ఈడీ, ఆదాయపన్ను శాఖ, సీబీఐ, అదానీ, అంబానీతో కూడిన మోదీ పరివార్‌.. సోనియా గాంధీ, రాహుల్‌, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతో బలమైన తమ పరివార్‌ మధ్య జరిగే యుద్ధం కొత్త చరిత్ర సృష్టిస్తుందని చెప్పారు. కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తానని చెప్పే భాజపా.. యడియూరప్ప, ప్రమోద్‌ మహాజన్‌, గోపీనాథ్‌ ముండే, రాజ్‌నాథ్‌ సింగ్‌ల కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చిందని, ఆ పార్టీ చెప్పేదొకటి.. చేసేదొకటని విమర్శించారు. గత విధానసభ ఎన్నికల్లో జనతాదళ్‌ అధినేత దేవేగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి దేశంలోనే అత్యంత అవినీతి పరులైన రాజకీయ నేతలని ప్రధాని మోదీ ఆరోపించారని.. నేడు వారినే పక్కనబెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీకి ఎన్నికల్లో విజయం తప్ప నైతికత అవసరం లేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో 14, కర్ణాటకలో 20 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఉదయం గుట్ట, కాడుగోడి, దిన్నూరు, కావేరి నగర, హుడి తదితర ప్రాంతాల్లో రోడ్‌షోలలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img