icon icon icon
icon icon icon

నేడు రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఫడణవీస్‌

భాజపా అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్‌, కిరణ్‌ రిజిజు, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సోమవారం రాష్ట్రానికి రానున్నారు.

Published : 22 Apr 2024 03:15 IST

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్‌, కిరణ్‌ రిజిజు, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సోమవారం రాష్ట్రానికి రానున్నారు. గోయల్‌.. చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నల్గొండ భాజపా అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నామినేషన్‌లలో; కిరణ్‌ రిజిజు.. మహబూబాబాద్‌ అభ్యర్థి సీతారాం నాయక్‌ కార్యక్రమంలో, ఫడణవీస్‌.. జహీరాబాద్‌ అభ్యర్థి బి.బి.పాటిల్‌ నామినేషన్‌లో పాల్గొంటారు.


25న బాన్సువాడలో అమిత్‌షా సభ

భాజపా అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఈ నెల 25న జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని బాన్సువాడలో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొననున్నారు. అమిత్‌షా ఇతర కార్యక్రమాలు ఖరారు కావాల్సి ఉందని పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. మే 4న సికింద్రాబాద్‌లో మహిళలతో భారీ సభను నిర్వహించేలా పార్టీ కసరత్తు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img