icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ కంటే ఎక్కువ సీట్లు గెలవాలి

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ కంటే ఎక్కువ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్‌ బన్సల్‌ పార్టీ నేతలకు సూచించారు.

Published : 22 Apr 2024 03:24 IST

ఎన్నికల కమిటీ సమావేశంలో బన్సల్‌

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ కంటే ఎక్కువ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్‌ బన్సల్‌ పార్టీ నేతలకు సూచించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశమై కార్యాచరణపై చర్చించింది. బన్సల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో భాజపాకు ఎంతో సానుకూలత ఉందని దీన్ని ఓట్ల రూపంలోకి మార్చుకుని మెజారిటీ స్థానాలు గెలిచేందుకు కృషిచేయాలన్నారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు భాజపాకు ఉన్నారని లోక్‌సభ సభ్యుల సంఖ్య దీనికంటే ఎక్కువగానే ఉండాలని ఉద్బోధించారు. పార్టీ ఇస్తున్న ఎన్నికల కార్యక్రమాలను నిర్దేశించిన మేరకు పూర్తి చేయాలన్నారు. వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు చెందిన ముఖ్యనేతలు, పలువురు జాతీయ నాయకులు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  సమావేశంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారీ, రాష్ట్ర నేతలు జి.ప్రేమేందర్‌రెడ్డి, డి.ప్రదీప్‌కుమార్‌, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img