icon icon icon
icon icon icon

17 రోజులపాటు కేసీఆర్‌ బస్సు యాత్ర.. 24 నుంచి ప్రారంభం

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 24 నుంచి 17 రోజులపాటు బస్సు యాత్ర చేయనున్నారు.

Updated : 22 Apr 2024 06:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 24 నుంచి 17 రోజులపాటు బస్సు యాత్ర చేయనున్నారు. తొలి రోజు(బుధవారం) నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సాయంత్రం 5.30 గంటలకు రోడ్‌షోతో కేసీఆర్‌ ఎన్నికల పర్యటన ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు సూర్యాపేటలో రోడ్‌షోలో పాల్గొని, ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. పర్యటన చివరి రోజు మే 10న సిరిసిల్లలో సాయంత్రం 5 గంటలకు రోడ్‌షోలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభకు కేసీఆర్‌ హాజరవుతారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి చేరుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img