icon icon icon
icon icon icon

పెళ్లి పత్రికపై ఎంపీ అభ్యర్థి ఫొటో: కేసు నమోదు

ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా వివాహ పత్రికపై భాజపా మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఫొటో ముద్రించడంపై కేసు నమోదు చేసినట్లు మెదక్‌ జిల్లా కౌడిపల్లి ఎస్సై రంజిత్‌రెడ్డి తెలిపారు.

Published : 22 Apr 2024 07:05 IST

కౌడిపల్లి, న్యూస్‌టుడే: ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా వివాహ పత్రికపై భాజపా మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఫొటో ముద్రించడంపై కేసు నమోదు చేసినట్లు మెదక్‌ జిల్లా కౌడిపల్లి ఎస్సై రంజిత్‌రెడ్డి తెలిపారు. మహ్మద్‌నగర్‌ గేట్‌ తండాకు చెందిన నునావత్‌ సురేశ్‌నాయక్‌ ఈ నెల 28న తన తమ్ముడు మదన్‌ వివాహాన్ని పురస్కరించుకొని, పెళ్లి పత్రికల్లో రఘునందన్‌రావు ఫొటో ముద్రించారు. అంతేకాకుండా వారి ఓట్లే పెళ్లికి బహుమతి అని కార్డుపై పేర్కొన్నారు. ఈ విషయమై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం(ఎఫ్‌ఎస్‌టీ) అధికారి సిరిగే చంద్రయ్య ఆదివారం స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img