icon icon icon
icon icon icon

రాముని ఆదర్శాలను నిలబెట్టేది రాహుల్‌ గాంధీనే: జగ్గారెడ్డి

శ్రీరామచంద్రుని ఆదర్శాలను నిలబెట్టే వ్యక్తి రాహుల్‌ గాంధీ మాత్రమేనని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు. పేదల కోసం రాముడు పాలన చేశారని, గుడి నిర్మాణం చేస్తే సంతోషిస్తానని ఆయన అనలేదని వ్యాఖ్యానించారు.

Published : 22 Apr 2024 04:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీరామచంద్రుని ఆదర్శాలను నిలబెట్టే వ్యక్తి రాహుల్‌ గాంధీ మాత్రమేనని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు. పేదల కోసం రాముడు పాలన చేశారని, గుడి నిర్మాణం చేస్తే సంతోషిస్తానని ఆయన అనలేదని వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో మహాత్మాగాంధీ చేసినట్టే.. ప్రస్తుతం రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని చెప్పారు. మోదీ పాలనలో దేశం అప్పులు రెట్టింపయ్యాయని ఆరోపించారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌లు రాజకీయంగా బతకాలంటే జై శ్రీరామ్‌ అనకతప్పదని వ్యాఖ్యానించారు. ఈటల రాజకీయ జీవితం.. రాహుల్‌గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నదని, అనవసర విమర్శలు చేస్తున్నారని తప్పుపట్టారు. గతంలో గుజరాత్‌ సీఎంగా మోదీ పేరును ఆ పార్టీ అధిష్ఠానం సీల్డ్‌ కవర్‌లో పంపిందని, అదే పద్ధతిలో రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని అనుకుని ఉంటే గత యూపీఏ పాలనలోనే అయ్యేవారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img